logo

ఉచితంగా హెపటైటిస్‌ బి టీకా

జిల్లాలోని మూడు ఏఆర్‌టీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా హెపటైటిస్‌ బి టీకా వేశారు. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, మార్కాపురం కేంద్రంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి, చీరాల ఏఆర్‌టీ కేంద్రంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శేషుకుమార్‌ సోమవారం ప్రారంభించారు

Published : 07 Feb 2023 03:12 IST

ఒంగోలు నగరం: జిల్లాలోని మూడు ఏఆర్‌టీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా హెపటైటిస్‌ బి టీకా వేశారు. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, మార్కాపురం కేంద్రంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి, చీరాల ఏఆర్‌టీ కేంద్రంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శేషుకుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులు టీకా వేయించుకోవడం వల్ల కాలేయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ రంగారావు, మెడికల్‌ ఆఫీసర్‌ జోసెఫ్‌, అమీన్‌, సుబ్రహ్మణ్యం, వైఆర్‌జీ జయలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని