logo

విద్యార్థిని మృతితో బాలికల్లో కలత

స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో అక్కడి వారు కలత చెందుతున్నారు.

Published : 08 Feb 2023 03:01 IST

సందర్శించి ధైర్యం చెప్పిన అధికారిణి

విద్యార్థినులతో మాట్లాడుతున్న మాధవీలత

దొనకొండ, న్యూస్‌టుడే: స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో అక్కడి వారు కలత చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా బాలికల డెవలప్‌మెంట్‌ అధికారిణి సిహెచ్‌. మాధవీలత స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారని, ఎలాంటి భయానికి లోను కావద్దని వారికి భరోసా కల్పించామన్నారు. అనారోగ్యానికి గురై ఓ విద్యార్థిని మృతి చెందటం .. అదే సమయంలో పాఠశాలలోని మరికొందరు అస్వస్థతకు గురవ్వడంతో వారు వేదన చెందారని వారికి తగిన సూచనలు, సలహాలిచ్చామన్నారు. ఇటీవలి సంఘటనలపై విచారిస్తున్నామని, తప్పు సిబ్బంది వైపు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం తనిఖీలో భాగంగా హెచ్చరించారు. శుద్ధ జల ప్లాంటులో నీరు సరిగా లేదని చెప్పారని, నీటిని పరీక్షలకు పంపించి వచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామన్నారు. మెనూ ప్రకారం భోజనాలు సమకూర్చాలని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారులు, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి వారి ఆదేశాల ప్రకారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని