logo

ముళ్ల కంపల్లో ఓఆర్‌ఎస్‌

దొనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి తాగడంతో వారంతా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు.

Published : 08 Feb 2023 03:01 IST

దొనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి తాగడంతో వారంతా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ తరుణంలో ఆ పాఠశాల సమీపంలోని ముళ్ల కంపల్లో ఈ ఏడాది మే నెల వరకు కాలపరిమితి ఉన్న ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పెద్ద సంఖ్యలో పడి కనిపించాయి. వాటిని ఇక్కడ ఎవరు పడవేశారో తెలియడంలేదు. జ్వరం, నీరసం, వాంతులు అవుతున్న వారికి వీటిని ఇస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సునీత వద్ద ప్రస్తావించగా తమకు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం వెళ్లి చూశామన్నారు. అప్పటికే అక్కడ మాయమయ్యాయని, తమకు ఒక్కటీ కనిపించలేదన్నారు. కాలపరిమితి అయిపోయినవి కూడా వైద్యశాలలో అప్పగించాలని, దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.

న్యూస్‌టుడే, దొనకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని