logo

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

జిల్లాలో నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌ నుంచి అన్ని మండలాల అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.

Published : 08 Feb 2023 03:01 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. చిత్రంలో డ్వామా పీడీ శీనారెడ్డి, అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌ నుంచి అన్ని మండలాల అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. పాఠశాలలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి అవసరాన్ని బట్టి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ఇవ్వాలని సూచించారు. బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు. స్పందనలోని అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల షెడ్లను మండల అధికారులు తనిఖీలు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన విద్యార్థులంతా ప్రతి రోజూ హాజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. హాజరు తక్కువగా ఉన్న పాఠశాలలను పర్యవేక్షకులు తనిఖీలు చేసి అందుకు గల కారణాలపై నివేదిక పంపాలని ఆదేశించారు. సీపీవో వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ శీనారెడ్డి, గృహనిర్మాణశాఖ జిల్లా అధికారి పేరయ్య, డీఈవో విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు...

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లాలోని మండల, డివిజన్‌ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల ఆడిట్‌, సాదా బైనామాలు, వ్యవసాయేతర భూమిగా మార్పిడి, 22(ఏ) భూ సమస్యల పరిష్కారంలో నిబంధనల మేరకు పనిచేయాలన్నారు. మార్కాపురం ఉపకలెక్టర్‌ సేతు మాధవన్‌, డీఆర్వో ఓబులేసు, ఎస్‌డీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని