logo

సమాచార సేకరణలో చురుగ్గా వ్యవహరించాలి

క్షేత్రస్థాయిలో నేరాలు, అసాంఘిక కార్యక్రమాల సమాచార సేకరణలో మహిళా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎస్పీ మలికా గార్గ్‌ సూచించారు.

Published : 09 Feb 2023 03:23 IST

ప్రశంసాపత్రాలు అందుకున్న మహిళా పోలీసులతో ఎస్పీ మలికా గార్గ్‌.. చిత్రంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో నేరాలు, అసాంఘిక కార్యక్రమాల సమాచార సేకరణలో మహిళా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎస్పీ మలికా గార్గ్‌ సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం మహిళా పోలీసుల పనితీరుపై ఎస్పీ సమీక్షించారు. తమ పరిధిలో ఎవరైనా అనుమానిత, కొత్త వ్యక్తులు తారసపడితే వారి వివరాలు సేకరించాలన్నారు. ఈవ్‌టీజింగ్‌, బాల్య వివాహాలు, ఎక్కువ రోజులు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, నామ ఫలకం లేని వాహనాలు, గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం తదితర అంశాలపై సమాచారం సేకరించి అధికారులకు తెలియజేయాలని సూచించారు. సైబర్‌ నేరాలు, ఉద్యోగాల పేరిట మోసాలు.. దిశ యాప్‌, సీసీ కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ మహిళా పోలీసులు వివిధ అంశాలపై ఇచ్చిన సమాచారాన్ని అధికారులు విశ్లేషించి చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక బీట్‌లు వేయాలని.. రాబోయే లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం డిసెంబర్‌, జనవరి నెలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు, మార్కాపురం డీఎస్పీ కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు