అనిశా వలలో కొండపి ఎస్సై, కానిస్టేబుల్
లంచం తీసుకుంటూ కొండపి స్టేషన్ ఎస్సై కె.రామకృష్ణ, కానిస్టేబుల్ జి.కోటేశ్వరరావు అలియాస్ కోటి బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(అనిశా) చిక్కారు.
పట్టుబడిన ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు
కొండపి, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: లంచం తీసుకుంటూ కొండపి స్టేషన్ ఎస్సై కె.రామకృష్ణ, కానిస్టేబుల్ జి.కోటేశ్వరరావు అలియాస్ కోటి బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(అనిశా) చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. కొండపి మండలం కట్టావారిపాలేనికి చెందిన అంగలకుర్తి రాములు కుమారులు వెంకటేశ్వర్లు, మధు మూడెకరాల భూమి విషయంలో తరచూ వివాదాలకు దిగుతూ పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. వెంకటేశ్వర్లు కుమారుడు మస్తాన్‌పై కూడా ఫిర్యాదు అందింది. మస్తాన్‌ను తప్పించేందుకు స్థానిక పోలీసులు రూ.35వేలు లంచం తీసుకున్నట్లు అభియోగం. ఈ కేసులు నడుస్తుండగానే.. వెంకటేశ్వర్లు తనను అకారణంగా దూషిస్తూ, వేధిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఇంతలోనే మరో వ్యక్తి కూడా వెంకటేశ్వర్లు తనను కులం పేరిట దూషించారంటూ ఫిర్యాదు చేశారు. మహిళను దూషించిన కేసులో 41 సీఆర్‌పీసీ నోటీసు ఇస్తామని.. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండటానికి లంచం ఇవ్వాలని ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అప్పటికే తన కుమారుడి కేసులో రూ.35 వేలు ఇచ్చిన వెంకటేశ్వర్లు మరోసారి ఇవ్వడం ఇష్టంలేక ఈ విషయాన్ని అనిశా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు పక్కా ప్రణాళిక రచించి వెంకటేశ్వర్లు రూ.20 వేలు ఇస్తుండగా ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనిశా జిల్లా ఇన్‌ఛార్జి డీఎప్పీ టి.వి.వి.ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, మన్మథరావు(గుంటూరు జిల్లా) శేషు, శ్రీనివాసరావు, అపర్ణ(ప్రకాశం) ఒంగోలు యూనిట్ ఎస్సైలు జె.వి.ఎన్.ప్రసాద్, ప్రసాద్ ఈ దాడిలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!