logo

‘నిబంధనలతో పేదలకు విదేశీ విద్య దూరం’

క్యూఎస్‌ 200 విశ్వవిద్యాలయాల పేరిట విదేశీ విద్యా పథకం లబ్ధిదారులను తగ్గించడాన్ని నిరసిస్తూ... తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హెచ్‌సీఎం కళాశాల ఎదుట ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు.

Published : 09 Feb 2023 03:23 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: క్యూఎస్‌ 200 విశ్వవిద్యాలయాల పేరిట విదేశీ విద్యా పథకం లబ్ధిదారులను తగ్గించడాన్ని నిరసిస్తూ... తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హెచ్‌సీఎం కళాశాల ఎదుట ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజ్‌విమల్‌ మాట్లాడుతూ... వైకాపా అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యా పథకాన్ని మూడున్నరేళ్లగా నిలిపివేసి పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పుడు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చి... రాష్ట్రవ్యాప్తంగా కేవలం 213 మందికి రూ.19 కోట్లు మాత్రమే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. క్యూఎస్‌ 200లోపు విశ్వవిద్యాలయం నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు హగయ్యరాజు, చుండి శ్యామ్‌, కపిల్‌బాషా, టి.రమాదేవి, కె.అంకరాజు, నాళం నరసమ్మ, రత్నకుమారి, పిల్లుట్ల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని