logo

మా సాగుభూమిని ఇప్పించండయ్యా...!

పొదిలిలో ఇరవై ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగాన్ని ఓ పార్టీ నాయకుడు, ప్రైవేటు సర్వేయరు ఆక్రమించి కంచె ఏర్పాటు చేసుకున్నారని గురునాథం సుబ్బారావు అలియాస్‌ ఘటోత్కచుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 09 Feb 2023 03:23 IST

ఓ నేత ఆక్రమించాడని ఫిర్యాదు

గురునాథం సుబ్బారావు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలో ఇరవై ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగాన్ని ఓ పార్టీ నాయకుడు, ప్రైవేటు సర్వేయరు ఆక్రమించి కంచె ఏర్పాటు చేసుకున్నారని గురునాథం సుబ్బారావు అలియాస్‌ ఘటోత్కచుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి, అప్పట్లో గుంటూరు రేంజి డీఐజీ వద్ద లొంగిపోగా, కుటుంబ పోషణ నిమిత్తం అప్పట్లో తహసీల్దార్‌ కొంత భూమి కేటాయించారన్నారు. అప్పట్లో ఏక్‌సాల్‌ పట్టాలు కూడా మంజూరు చేశారన్నారు. అప్పటి నుంచి ఆ భూమి తన స్వాధీనంలో ఉండి అనుభవిస్తున్నట్లు చెప్పారు.  ఇటీవల ఓ పార్టీ నాయకుడు, ప్రైవేటు సర్వేయరు కొంతభాగం ఆక్రమించి కంచె ఏర్పాటు చేయగా, పలుమార్లు వారిని అడిగితే ఆ భూమి తమదంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. సామాజికంగా వెనుకబడిన కులానికి చెందిన తాను పెద్దలతో మాట్లాడలేకపోతున్నామని, రాజకీయ అండదండలు వారికి ఉండటం వల్ల తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. దీనిపై పొదిలి తహసీల్దార్‌ కార్యాలయం, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగ లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని