logo

చట్ట పరిధిలో అర్జీల పరిష్కారం : ఎస్పీ

జైకిసాన్‌ అగ్రికల్చర్‌ వెల్ఫేర్‌ సొసైటీ అనే సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం అనిచెప్పి తనవద్ద రూ.2.50 లక్షలు వసూలుచేసి తొమ్మిదినెలలు ఉద్యోగం చేయించి కేవలం రెండునెలల వేతనం మాత్రమే ఇచ్చారని ఒంగోలుకు చెందిన ఎస్‌.రాజా ఫిర్యాదు చేశారు.

Published : 21 Mar 2023 06:19 IST

ఫిర్యాదులపై క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:

* జైకిసాన్‌ అగ్రికల్చర్‌ వెల్ఫేర్‌ సొసైటీ అనే సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం అనిచెప్పి తనవద్ద రూ.2.50 లక్షలు వసూలుచేసి తొమ్మిదినెలలు ఉద్యోగం చేయించి కేవలం రెండునెలల వేతనం మాత్రమే ఇచ్చారని ఒంగోలుకు చెందిన ఎస్‌.రాజా ఫిర్యాదు చేశారు. ఆ బోగస్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

త్రోవగుంటలోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీ నుంచి బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా 2019లో రూ.1.66 లక్షలతో ఆటో కొనుగోలు చేసి, రూ.2,12,746 చెల్లించినా, ఇంకా రూ.1,66,990 చెల్లించాలని కంపెనీ ప్రతినిధులు వేధిస్తున్నారని ఒంగోలుకు చెందిన యు.రమణయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. పలువురితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వినతులను పరిశీలించి చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్పందనలో 79 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, దిశ డీఎస్పీ పల్లపురాజు, డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర, ప్యానెల్‌ అడ్వకేట్‌ బి.వి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని