logo

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ హెచ్చరించారు.

Published : 21 Mar 2023 06:19 IST

ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ హెచ్చరించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. తొలుత ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించి, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. త్రిపురాంతకం మండలం రామసముద్రంలో తాగునీటి సమస్య ఉంది, దాంతోపాటు, సాగుకు కూడా నీరు కావాలని స్థానికుడు నరసారెడ్డి కోరారు. కార్యక్రమంలో డీఆర్వో ఓబులేసు, ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం, ఎస్‌డీసీలు ఉమాదేవి, చెన్నయ్య, జగదీశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్పందనలో పలు సమస్యలపై మొత్తం 175 అర్జీలు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని