logo

‘ఏరువాక’ను తరలించొద్దు

జిల్లా నుంచి ఏరువాక కేంద్రాన్ని నరసరావుపేటకు తరలించే ప్రక్రియను విరమించుకోవాలంటూ రైతు సంఘాల సమన్వయ సమితి ధర్నా చేపట్టింది.

Published : 24 Mar 2023 03:49 IST

ధర్నాలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు.. మాట్లాడుతున్న
సమితి జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా నుంచి ఏరువాక కేంద్రాన్ని నరసరావుపేటకు తరలించే ప్రక్రియను విరమించుకోవాలంటూ రైతు సంఘాల సమన్వయ సమితి ధర్నా చేపట్టింది. కలెక్టరేట్‌ వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సమితి జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఏరువాక కేంద్రం ద్వారా ప్రధానంగా వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, మిరప పంటలకు సంబంధించి నూతన వంగడాలు, అధిక ఉత్పత్తికి అవసరమైన యాజమాన్య పద్ధతులపై సూచనలు పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు నరసరావుపేటకు తరలిస్తే తూర్పు ప్రకాశం, బాపట్ల జిల్లా వాసులకు కేంద్రం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నాయకులు వి.హనుమారెడ్డి, పమిడి వెంకటరావు, చుంచు శేషయ్య, ఎస్‌.లలితకుమారి, మండవ శ్రీనివాసరావు, పెంట్యాల హనుమంతురావు, కె.వీరారెడ్డి, ఉప్పుటూరి ప్రకాశం పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని