logo

ఉప్పు సాగు రైతులకు చేయూత

ఉప్పు సాగు చేస్తున్న రైతుల అవసరాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందేలా చూస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 24 Mar 2023 03:49 IST

ఉప్పు రైతుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఉప్పు సాగు చేస్తున్న రైతుల అవసరాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందేలా చూస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రీ సర్వే పనుల్లో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉప్పు తయారుచేస్తున్న కొటార్లను పరిశీలించి, దాని తయారీ గురించి అడిగారు.  గిట్టుబాటు ధర దక్కేలా చేయడంతోపాటు, నిల్వ చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని రైతులు కోరారు. అందుకు స్పందించిన కలెక్టర్‌...ఉప్పు సాగు విస్తీర్ణం, దీనిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల వివరాలను సమగ్రంగా సేకరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. చదువుకున్న యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా యూత్‌ సర్వే ద్వారా విద్యార్హతలు సేకరించాలని సూచించారు. అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వారని స్థానికులు ఆయన దృష్టికి          తీసుకురాగా, సదరు యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఒంగోలు, కొత్తపట్నం మండల తహసీల్దార్లు మురళి, రమణారావు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు