logo

భార్యపై వరకట్నం, లైంగిక వేధింపులు

భార్యను వేధించటమే కాకుండా, అసహజ లైంగిక కార్యకలాపాలు కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్న భర్త, సహకరిస్తున్న వారిపై దిశ పోలీసులు  కేసు నమోదు చేశారు.

Published : 24 Mar 2023 03:49 IST

విజయవాడ నేరవార్తలు : భార్యను వేధించటమే కాకుండా, అసహజ లైంగిక కార్యకలాపాలు కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్న భర్త, సహకరిస్తున్న వారిపై దిశ పోలీసులు  కేసు నమోదు చేశారు. విజయవాడకు చెందిన ఓ యువతి (26)కి ఒంగోలుకు చెందిన ఓ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌తో 2021, నవంబరులో వివాహమైంది. కట్నం కింద రూ.20లక్షల నగదు, బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, ఆడపడుచు కట్నం కింద మరో రూ.5 లక్షలు ఇచ్చారు. యువతికి 100 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. యువతి.. ఒంగోలులోని అత్తగారింటికి కాపురానికి వెళ్లింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తుండటంతో.. తన తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఆమెకు చెందిన మొత్తం బంగారాన్ని అత్తమామలు లాక్కుని, వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత భర్త పనిచేస్తున్న చెన్నైలో కాపురం పెట్టారు. అసహజ పద్ధతిలో కాపురం చేయాలని భర్త ఒత్తిడి చేయటంతో ఆమె నిరాకరించింది. ఈలోగా భార్యకు గర్భం రావటంతో.. బంధువులైన ఇద్దరు వైద్యుల సాయంతో అతడు అబార్షన్‌ చేయించాడు. పుట్టింటికి వెళ్లిన భార్యకు.. తరచూ నీలిచిత్రాలు పంపించి, వేధించటం మొదలుపెట్టాడు. ఈ విషయంపై పెద్ద మనుషుల్లో పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ నెల 19వ తేదీ రాత్రి నగరంలో ఉంటున్న భార్య ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. కాళ్లతో తన్ని.. రూ.20లక్షలు ఇవ్వాలని, లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. యువతి భర్త, అత్తమామలు, ఆడపడుచు, అబార్షన్‌ చేసేందుకు సాయం చేసిన ఇద్దరు వైద్యులపై 498ఎ, 406, 313, 354ఎ, 377, 506 ఐపీసీ, 3, 4 డీపీఏ, 67ఎ, 67 ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని