logo

లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన టంగుటూరు 16వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

Published : 24 Mar 2023 03:49 IST

జాతీయ రహదారిపై మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

టంగుటూరు, న్యూస్‌టుడే: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన టంగుటూరు 16వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. కొత్తపట్నం కాంతినగర్‌కు చెందిన సింగోతు వెంకటేశ్వర్లు (30) గురువారం సాయంత్రం ఏపీ 26 ఏఫ్‌ 0997 ద్విచక్ర వాహనంపై సింగరాయకొండ నుంచి ఒంగోలుకు వెళ్తున్నారు. 16వ జాతీయ రహదారిపై లారీ అతి వేగంగా వెళుతూ వెంకటేశ్వర్లు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు స్థానిక టంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా హైవే  పోలీసులు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సై ఖాదర్‌బాషా, సిబ్బంది మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆటోలో ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. ఢీకొట్టిన వ్యక్తి లారీతో సహా పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

రోడ్డు ప్రమాదంలో గాయపడి..: హనుమంతునిపాడు : కనిగిరి - కంభం రహదారిలో ఆవులవారిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహన చోదకుడు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోనిగుండ్ల మండలం కనగాలకు చెందిన గోపాల రాజు (30) ద్విచక్ర వాహనంపై కనిగిరి పట్టణానికి వచ్చి బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆవులవారిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం, పాల ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల రాజుతో పాటు ఆటో చోదకుడు గాయపడ్డారు. రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు తరలిస్తుండగా, గురువారం తెల్లవారుజామున మార్గంమధ్యలో మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై కృష్ణపావని తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ పాపారావు పరిశీలించారు.    

రాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని