logo

ఆసరా లబ్ధి రూ.280.50 కోట్లు

మూడో విడత ఆసరా పథకం కింద జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 36,769 స్వయం సహాయక సంఘాల్లోని 3,59,506 మంది సభ్యులకు    రూ.280.50 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 02:16 IST

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,

నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మూడో విడత ఆసరా పథకం కింద జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 36,769 స్వయం సహాయక సంఘాల్లోని 3,59,506 మంది సభ్యులకు    రూ.280.50 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని ప్రకాశం భవన్‌లో శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. మహిళలు స్వశక్తితో ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం అందిస్తున్న నిధులను మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేసేలా ప్రభుత్వం అండగా ఉంటున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా వారికి ప్రయోజనం కల్పించడంతోపాటు, ప్రజాసేవలోనూ వారికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, డీఆర్డీఏ పీడీ బాబురావు, మెప్మా పీడీ రవికుమార్‌, ఎల్‌డీఎం యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని