logo

మార్కాపురం జిల్లా సాధనే లక్ష్యంగా ముందుకు

మార్కాపురం నియోజకవర్గంలో ఆదివారం నుంచి చేపట్టనున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 26 Mar 2023 02:16 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి,  తెదేపా నాయకులు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే :  మార్కాపురం నియోజకవర్గంలో ఆదివారం నుంచి చేపట్టనున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కొనకనమిట్ల మండలంలోని వెలిగొండ క్షేత్రం నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు.  కొనకనమిట్ల, మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ యాత్ర సాగుతుందని ఏప్రిల్‌ 14వ తేదీన ముగుస్తుందని పేర్కొన్నారు. మొదటి రోజు కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొంటారని తెలిపారు.  మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ఇటీవల బడ్జెట్‌లోనూ సరైన నిధులు కేటాయించకుండా ఏవిధంగా ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నయవంచనకు అడ్డుకట్ట వేసి ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు టి.సత్యనారాయణ, ఎస్‌కె.మౌలాలి, రామాంజులరెడ్డి, చిన్నపరెడ్డి, కె.శ్రీనివాసులు, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని