logo

వైద్యులకు సేవాగుణం అవసరం

ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

Published : 26 Mar 2023 02:16 IST

జ్యోతి వెలిగించి స్నాతకోత్సవాన్ని  ప్రారంభిస్తున్న అతిథులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై హౌస్‌ సర్జన్‌ పూర్తిచేసిన వంద మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్యులు సేవా గుణం అలవరచుకోవాలని... పేదలకు సేవచేస్తే దేవుడికి చేసినట్లేనని పేర్కొన్నారు. వైద్యరంగంలో వస్తున్న వినూత్న మార్పులపై అవగాహన పెంచుకుని... అందరూ మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. మన వైద్యరంగం సత్తా ఏమిటో కరోనా సమయంలో యావత్‌ ప్రపంచం గుర్తించిందన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ సాల్మన్‌రాజు అధ్యక్షతన నిర్వహించిన వేడుకలో వైస్‌ ప్రిన్సిపల్‌ సుధాకర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌, డాక్టర్‌ కేశవ్‌, డాక్టర్‌ జీవన్‌ తదితరులు పాల్గొన్నారు. వైద్యరంగంలో రాణించేందుకు అవసరమైన సూచనలు చేశారు. పట్టా పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు, బంధువులతో ఆనందాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని