జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి మల్లెల నిఖిల్ చంద్ రూపొందించిన ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్ వే హెక్సా మిషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు ఎంపికైంది.
ఎంపికైన ప్రాజెక్టుతో విద్యార్థి నిఖిల్ చంద్, గైడ్ టీచర్ షేక్ మస్తాన్ వలి
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి మల్లెల నిఖిల్ చంద్ రూపొందించిన ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్ వే హెక్సా మిషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 23, 24 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి మొత్తం 15 ప్రాజెక్టులు వెళ్లాయి. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నమూనాలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు... నిఖిల్ చంద్ తయారు చేసిన ప్రాజెక్టును జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. త్వరలో దిల్లీలో జరిగే పోటీల్లో ఈ నమూనాను విద్యార్థి ప్రదర్శించనున్నాడు. తక్కువ బరువు కలిగిన ఐరన్ ఫ్రేమ్, హేక్సా బ్లేడ్‌లు, 12 వాట్స్ విద్యుత్తు బ్యాటరీ సాయంతో ఈ యంత్రాన్ని తయారు చేశాడు. దీనితో పైపులు, చెక్కలను మనకు కావాల్సిన కొలతలతో కోయవచ్చు. ఒకే సారి నాలుగు వైపులా కోయగల సామర్థ్యం ఈ యంత్రం ప్రత్యేకత. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఈ సందర్భంగా విద్యార్థితో పాటు, గైడ్ టీచర్ షేక్ మస్తాన్‌వలిని... డీఈవో పి.రమేష్, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్ అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..