logo

ప్రజా న్యాయవాది రాఘవరాణి

ప్రజా న్యాయవాది, మహిళా ఉద్యమ నాయకురాలు రాఘవరాణి అని హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 02:16 IST

సభలో ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి  మన్మథరావు, వేదికపై ఇతర ప్రతినిధులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా న్యాయవాది, మహిళా ఉద్యమ నాయకురాలు రాఘవరాణి అని హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు పేర్కొన్నారు. ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన మట్లె రాఘవరాణి ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాఘవరాణి, వెంకటసుబ్బయ్యతో ఉన్న అనుబంధం... తనలో సామాజిక ప్రేరణకు కారణమన్నారు. తద్వారా ప్రజల మధ్య ఉండి న్యాయవాద వృత్తిని కొనసాగించాలన్న ఉత్సాహం కలిగిందని వివరించారు. వారిద్దరి త్యాగాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్‌రావు, ప్రజా సంఘాల నాయకులు పి.గోవిందయ్య, సూర్యకుమారి, బీవీఎన్‌ స్వామి, టి.అరుణ, నూకతోటి బాబూరావు, బి.పరంజ్యోతి, నార్నె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు