logo

రిటర్నుల దాఖలులో జాగ్రత్తలు తప్పనిసరి

గ్రానైట్ పరిశ్రమల వారు తమ పన్ను రిటర్నులను పూర్తి వివరాలతో సకాలంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ, జాతీయ నమూనా సర్వే నెల్లూరు కార్యాలయ అధికారి టి.రామకృష్ణ, ఎండీ ఫజలుల్లా పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 02:16 IST

పేర్నమిట్ట (సంతనూతలపాడు), న్యూస్‌టుడే: గ్రానైట్ పరిశ్రమల వారు తమ పన్ను రిటర్నులను పూర్తి వివరాలతో సకాలంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ, జాతీయ నమూనా సర్వే నెల్లూరు కార్యాలయ అధికారి టి.రామకృష్ణ, ఎండీ ఫజలుల్లా పేర్కొన్నారు. ఈ మేరకు పేర్నమిట్టలోని గ్రానైట్ యజమానుల సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ఎటువంటి తప్పులు లేకుండా, సరైన సమాచారాన్ని పొందుపరచాలన్నారు. ఆడిట్ నివేదికలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. లేదంటే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆన్‌లైన్లో రిటర్నుల దాఖలు, ఆడిట్ నివేదిక, బ్యాలెన్స్‌ షీట్‌ను ఉపయోగించి దాఖలు చేసే విధానం తదితరాలపై అవగాహన కల్పించారు. సదస్సులో సంఘం అధ్యక్షులు కొండారెడ్డి, నెల్లూరు ప్రాంతీయ కార్యాలయ అధికారులు బెహరా, ఆనంద్‌, బూదవాడ, చీమకుర్తి, ఒంగోలు, పేర్నమిట్ట ప్రాంతాల్లోని పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని