logo

ఎన్‌ఎంఎంఎస్‌కు 219 మంది ఎంపిక

నేషనల్‌ మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌నకు జిల్లా నుంచి 219 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు డీఈవో కార్యాలయానికి జాబితా చేరింది.

Updated : 26 Mar 2023 03:53 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నేషనల్‌ మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌నకు జిల్లా నుంచి 219 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు డీఈవో కార్యాలయానికి జాబితా చేరింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఈ పరీక్ష నిర్వహించగా... శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారికి నాలుగేళ్లు పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. తదుపరి చదువు తప్పనిసరిగా ప్రభుత్వ సంస్థల్లోనే కొనసాగించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని