logo

‘జలధార’లో ఎస్సీ రైతులకు రాయితీ

అమ్రిత్‌ జలధార పథకం కింద నీటి వసతి కల్పించేందుకు ఎస్సీ రైతులకు ప్రాజెక్ట్‌ ఖరీదులో రూ.50 వేల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 02:16 IST

ఒంగోలు గ్రామీణం: అమ్రిత్‌ జలధార పథకం కింద నీటి వసతి కల్పించేందుకు ఎస్సీ రైతులకు ప్రాజెక్ట్‌ ఖరీదులో రూ.50 వేల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ప్రకాశం భవన్‌లో శనివారం సమీక్షించారు. కనీసం 2.50 ఎకరాల భూమి కలిగి ఉండి, వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉన్న ఎస్సీ రైతులు అర్హులన్నారు. స్వయం ఉపాధి కోసం ట్రాక్టర్‌, ట్రాలీ, ఇతర వాహనాలకు ఆర్థికసాయం కింద రూ.60 వేల వరకు ఇవ్వనున్నట్లు వివరించారు. అర్హులైనవారు దరఖాస్తులను ఈ నెల 27లోపు ఒంగోలు ప్రగతిభవన్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని