logo

చిన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీతో మేలు

పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరముందని లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 27 Mar 2023 04:09 IST

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ్‌

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌. చిత్రంలో  డాక్టర్‌ నరేంద్ర, డాక్టర్‌ భానుతేజ తదితరులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరముందని లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు.జిల్లాలోని ఒంగోలులో నూతనంగా ఏర్పాటుచేసిన అరవింద్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు సడలించి 30 నుంచి 40 పడకలుండే చిన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులిస్తే పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతుందన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 1.1 నుంచి 1.2 శాతం మాత్రమే కేటాయించడం సరి కాదన్నారు.

అత్యాధునిక వైద్యసేవలతో..

ఒంగోలు ఎన్జీవో కాలనీలోని అరవింద్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ మందలపు నరేంద్రబాబు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌.భానుతేజ వివరించారు. ఇంటర్వెన్షనల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పల్మనాలజీ కోసం అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ నరేంద్రబాబు తెలిపారు. చర్మవ్యాధుల వైద్య నిపుణులు మందలపు వెంకట్రావు, ఎండోక్రైనాలజిస్ట్‌ ఎం.హనుమంతరావు, న్యూరాలజిస్ట్‌ ఎం.అరవింద తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని