రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిన ప్రమాదంలో యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తూర్పు వెంకటాపురం - గణేషునిపురం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది.
ఒకరి పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడ్డ యశ్వంత్
దర్శి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిన ప్రమాదంలో యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తూర్పు వెంకటాపురం - గణేషునిపురం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం .. దర్శికి చెందిన నల్లా యశ్వంత్ మరో యువకుడితో కలిసి రంగులు వేయడానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. పొలాల్లోనుంచి అకస్మాత్తుగా పంది రావటంతో తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ప్రమాదంలో యశ్వంత్ చెవి వద్ద తీవ్ర గాయమైంది. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
Politics News
YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
ACB Court: లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ