logo

లోపభూయిష్టంగా ఆరోగ్య హక్కు చట్టం: ఐఎంఏ

ప్రైవేట్‌ వైద్యుల హక్కులను పరిగణనలోకి తీసుకుని... వారితో చర్చించి, సమగ్ర చట్టం తెచ్చేవరకు ఆరోగ్య హక్కు చట్టాన్ని నిలిపివేయాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 02:09 IST

నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న ప్రైవేట్‌ వైద్యులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రైవేట్‌ వైద్యుల హక్కులను పరిగణనలోకి తీసుకుని... వారితో చర్చించి, సమగ్ర చట్టం తెచ్చేవరకు ఆరోగ్య హక్కు చట్టాన్ని నిలిపివేయాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఐఎంఏ హాలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఒంగోలు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ జాలాది మణిబాబు, కార్యదర్శి డాక్టర్‌ ఎం.రంగనాథబాబు, కోశాధికారి డాక్టర్‌ జె.కృష్ణ మాట్లాడారు. రాజస్థాన్‌ ప్రభుత్వం అక్కడి అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం... ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారన్నారు. వైద్యులకు చెల్లింపుల విషయంలో మాత్రం సరైన విధివిధానాలు రూపొందించలేదన్నారు. ఈ విషయమై అక్కడి వైద్యులు శాంతియుతంగా నిరసన చేపడుతుండగా పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం... అఖిల భారత నిరసన దినంగా పాటించాలని కేంద్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. నగరంలోని వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి... జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఐఎంఏ ప్రతినిధులు ఎం.వీరయ్యచౌదరి, కేసీ మాల్యాద్రినాయుడు, హైమావతి, రోహిణీకుమారి, ఎన్‌.నితిన్‌కుమార్‌, విద్యాసాగర్‌, పి.దుర్గాప్రసాద్‌, పీఎస్‌ఎం ప్రసాద్‌, ఎస్‌.విజయరాఘవరావు, ఎం.ఆనంద్‌, డి.వెంకటేశ్వర్లు, హిమబిందు, ఎం.సంజీవరెడ్డి, జాకబ్‌ జక్రయ్య, కె.సుధాకర్‌, రవికుమార్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని