logo

పది మంది వైద్యుల నియామకం

ఉమ్మడి ప్రకాశం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు.

Published : 28 Mar 2023 02:09 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి కందుకూరులో మూడు, కనిగిరిలో నాలుగు, మార్కాపురంలో ఒక వైద్యాధికారి పోస్టుకు నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మార్కాపురం ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఎన్‌ఆర్‌సీలో ఒక పోస్టు భర్తీ చేసినట్టు వివరించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు కోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఏఎన్‌ఎంలు ఎనిమిది మందిని సర్దుబాటు చేయడానికి కౌన్సెలింగ్‌ నిర్వహించినట్టు సోమవారం ప్రకటనలో తెలిపారు.

వైద్యశాఖ ఉద్యోగికి తాఖీదులు...: తన కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌కి తాఖీదులు జారీ చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో భాగంగా కొంతమంది ఎంపీహెచ్‌వో(పురుషులు)లను హెల్త్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలకు ఇటీవల సర్దుబాటు చేశారు. ఆ విభాగం విధులు చూసే ఉద్యోగి తనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు పంపినట్టు  గుర్తించారు. ఈ విషయమై తాఖీదులు పంపి సంజాయిషీ కోరడంతో పాటు సంబంధిత విధుల నుంచి ఆ ఉద్యోగిని తప్పించినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని