logo

కేంద్రం సరే... ధాన్యం కొనుగోళ్లేవీ?

ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు... ఇప్పుడు ఆ పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.

Published : 30 Mar 2023 02:33 IST

ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు స్వామిరెడ్డి

ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు... ఇప్పుడు ఆ పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. కనపర్తి ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది సుమారు 3,200 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మంచి దిగుబడులూ వచ్చాయి. ఈ పరిధిలో రెండు రైతు భరోసా కేంద్రాలు ఉండగా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితమే దీనిని ప్రారంభించినా... కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఈ పరిధిలో 500 లారీలకు పైగా ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనా కాగా... ఇప్పటి వరకు ఇరవై లారీల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంట మొత్తం కల్లాలు, రహదారులపైనే ఆరబోశారు. గత కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడం... తరచూ చిరు జల్లులు పడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో నిల్వ చేసే పరిస్థితి లేదని... భారీ వర్షం పడితే మొత్తం నష్టపోక తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా... అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి... త్వరితగతిన కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు

కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పడిగాపులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని