logo

మాచర్లలో ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

Published : 30 Mar 2023 02:33 IST

బాదినేనిపల్లెలో విషాదం

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమరోలు మండలంలోని బాదినేనిపల్లెకు చెందిన జోగిపర్తి మల్లికార్జున(35) భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటున్నారు. అక్కడి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన మల్లికార్జున ఆచూకీ లేకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని మాచర్ల సమీపంలో ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా, గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు వచ్చి పరిశీలించి బాదినేనిపల్లెకు చెందిన మల్లికార్జునగా గుర్తించారు.  దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. అనంతరం హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు