పశ్చిమానికి పాలకుల నిర్లక్ష్యమే శాపం!
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయనేది పశ్చిమ ప్రకాశం వాసుల ఆశ. అందుకు వేల మంది నిర్వాసితులు ఊళ్లు, ఇళ్లను వదిలి త్యాగాలకూ సిద్ధమయ్యారు.
ఎన్నికల హామీగానే వెలిగొండ పూర్తి
సాకారం కాని మార్కాపురం ప్రత్యేక జిల్లా
ఈనాడు డిజిటల్, ఒంగోలు:
వెలిగొండ ప్రాజెక్టు సొరంగ మార్గం
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయనేది పశ్చిమ ప్రకాశం వాసుల ఆశ. అందుకు వేల మంది నిర్వాసితులు ఊళ్లు, ఇళ్లను వదిలి త్యాగాలకూ సిద్ధమయ్యారు. మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా సుదీర్ఘకాలంగా ఉంది. అప్పుడే పరిపాలనా పరమైన సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి నోచుకుంటాయని ఆ ప్రాంత ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇవి రెండూ సాకారం కావడం లేదు. ఈ పరిస్థితులు ఆ ప్రాంత వాసులను వేదనకు గురిచేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చాక కూడా హామీ ఇచ్చి...: పశ్చిమ ప్రకాశంతో పాటు వైఎస్సార్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని 15 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఏటికేడు ఇదిగో పూర్తిచేస్తాం... నీళ్లు ఇస్తామన్న ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకున్నది లేదు. 2019 ఎన్నికల ప్రచారంలో తెదేపా, జనసేనతో పాటు వైకాపా కూడా ఈ అంశంపై హామీలు గుప్పించాయి. గతేడాది జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చీమకుర్తి సభలోనూ వెలిగొండ పూర్తిచేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటించారు. ఆ మేరకు ఈ ఏడాది సెప్టెంబరుకు ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.101 కోట్లు కేటాయించింది. వాస్తవానికి దాదాపు రూ.2500 కోట్లు అవసరం అవుతాయని అంచనా. కేటాయింపులే లేకుంటే ప్రాజెక్టు పూర్తి ఇంకెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత కందుల నారాయణరెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు.
ప్రత్యేక జిల్లాపై పట్టింపేదీ...: యాభై ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి ప్రకాశంలో కలిసింది పశ్చిమ ప్రాంతం. భౌగోళికంగా జిల్లా కేంద్రం అయిన ఒంగోలుకు ఆ ప్రాంతాలు సుదూరంలో ఉండిపోయాయి. దీంతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గతేడాది జిల్లాల విభజన సమయంలోనూ తమ వాణిని ఈ ప్రాంత ప్రజలు బలంగా వినిపించారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ అంశాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి లేవనెత్తుతున్నారు.
కేంద్ర మంత్రుల దృష్టికీ సమస్యలు...
సమస్యలపై కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి వినతి పత్రం అందజేస్తున్న భాజపా నాయకులు పురందేశ్వరి, లంకా దినకర్
పశ్చిమ ప్రకాశంపై రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా పొలిటికల్ ఫీడ్‌బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, సోమ్‌ప్రకాష్, నితిన్ గడ్కరీలకు ఇటీవల వినతి పత్రాలు అందజేశారు. అందులో మార్కాపురం జిల్లాతో పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అంశాలను ప్రస్తావించారు. అలాగే ఒంగోలు, దొనకొండ రైల్వే మార్గం, కనిగిరి నియోజకవర్గంలో నిమ్జ్ ఏర్పాటు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి అంశాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!