logo

ఆరుగాలం శ్రమకు అకాల కష్టం

అకాల వర్షాలు జిల్లాను వీడటం లేదు. గత కొద్దిరోజులుగా అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. దీంతో సాగులో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది.

Updated : 01 Apr 2023 05:50 IST

కొమరోలు: నేలవాలిన అరటి తోటను పరిశీలిస్తున్న ఎంపీపీ అమూల్య, ఉద్యానవనాధికారిణి శ్వేత, రైతులు

కొమరోలు గ్రామీణం, ముండ్లమూరు- న్యూస్‌టుడే: అకాల వర్షాలు జిల్లాను వీడటం లేదు. గత కొద్దిరోజులుగా అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. దీంతో సాగులో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది. కొమరోలు మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు వీచడంతో పాటు వడగళ్ల వాన కురిసింది. దీంతో 1,113 హెక్టార్లలోని అరటి, మామిడి, పత్తి, మొక్కజొన్న, మునగ పంటలు దెబ్బతిన్నాయి. అల్లినగరం, వట్టివేపమానిపల్లె, పామూరిపల్లె, గోనెపల్లె, బ్రాహ్మణపల్లె గ్రామాల రైతులకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ‌ ముండ్లమూరు మండలం మారెళ్లలో శుక్రవారం సాయంత్రం సుమారు 15 నిముషాల పాటు వడగళ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచాయి. సుంకరవారిపాలెం, ముండ్లమూరు, పసుపుగల్లు, పెదఉల్లగల్లు, పులిపాడు గ్రామాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిరప కాయలు తడవకుండా రైతులు పరదాలు కప్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. అకాల వర్షంతో మిరప, మొక్కజొన్న, వైట్‌బర్లీ పొగాకు పంటలకు నష్టం వాటిల్లుతుందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని