logo

‘ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విస్మరించారు’

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం మహా ధర్నా చేపట్టారు.

Published : 01 Apr 2023 04:12 IST

మహా ధర్నాలో పాల్గొన్న ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే.విశ్వనాథ్‌ మాట్లాడుతూ... భాజపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పిందని, లేదంటే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లవుతున్నా ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు టి.ఆనంద్‌, వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్‌, నాయకులు జలదంకి నరసింహారావు, ఆదిమూలపు ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ సమీపంలోని అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఆర్‌.శ్రీలతకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని