logo

ఉచిత అంబులెన్స్‌ సేవలు ప్రారంభం

పేలప్రోలు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌... శుక్రవారం ప్రారంభిచారు.

Published : 01 Apr 2023 04:12 IST

అత్యవసర వాహనాన్ని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, భగవాన్‌ నాయక్‌ తదితరులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పేలప్రోలు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌... శుక్రవారం ప్రారంభిచారు. కర్నూలు రోడ్డు మఠంబజార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పేదల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ట్రస్ట్‌ అందించే వైద్యసేవలకు శాఖాపరంగా తమ సహకారం అందిస్తామన్నారు. విశ్రాంత పోలీసు అధికారి రాజశిఖామణి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యక్కల తులసీరావు... ట్రస్ట్‌ అందిస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్ట్‌ నిర్వాహకులు పేలప్రోలు రామకృష్ణ పరమహంస (బిర్లా) మాట్లాడుతూ త్వరలో ఉచిత ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంచినేని మాధవి, ప్రవాస భారతీయుడు సాగర్‌ మాట్లాడారు. అంబులెన్స్‌ ఏర్పాటుకు చిలకలూరిపేటకు చెందిన మద్ది రమేష్‌ రూ.11 లక్షల సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘనశ్యాం, మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, ఎం.శ్రీనివాసరావు, పేలప్రోలు ప్రమీల, బ్రహ్మానందం, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్‌ సేవలు అవసరమైన వారు ఏ సమయంలోనైనా 98855 80188 నంబరులో సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని