logo

క్రీడా పోటీలతో నాయకత్వ లక్షణాలు

జేఎన్‌టీయూకే సెంట్రల్‌ జోన్‌ క్రీడా పోటీలు రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 01 Apr 2023 04:12 IST

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కళాశాల ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే సెంట్రల్‌ జోన్‌ క్రీడా పోటీలు రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే పోటీలను కళాశాల కార్యదర్శి శిద్దా హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కళాశాలలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్టర్‌ శిద్దా సూర్యప్రకాశరావు, గౌరవ ఛైర్మన్‌ ఇస్కాల రంగమన్నార్‌ మాట్లాడుతూ... క్రీడా పోటీల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి పెరుగుతాయన్నారు. వర్సిటీ క్రీడా విభాగం కార్యదర్శి జీపీ రాజు, కళాశాల డైరెక్టర్‌ ఏవీ భాస్కరరావు, ప్రిన్సిపాళ్లు కేవీ సుబ్రహ్మణ్యం, రమేష్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ హిమచంద్రబాబు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని అయిదు జిల్లాల్లోని 32 కళాశాలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలి రోజు మహిళా విభాగంలో ఖోఖో, బ్యాడ్మింటన్‌, చెస్‌; పురుషుల విభాగంలో ఖోఖో, బాస్కెట్‌ బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని