logo

నేత్రపర్వం.. లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవం

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 01 Jun 2023 03:25 IST

అంకురార్పణతో వేడుకలు ప్రారంభం

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి వేద పండితులు అంకురార్పణతో ప్రారంభించి, బుధవారం ఉదయం ధ్వజారోహణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను చంద్రప్రభ వాహనంపై గ్రామ వీధుల్లో భక్తులు ఊరేగించారు. 11 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని ధ్వజ స్తంభానికి గరుడ పటాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి సేవ చేసేందుకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం సంప్రదాయమని ప్రధాన అర్చకులు వేంకట లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. గరుత్మంతుడు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సత్కారాలు చేస్తూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. దోషాల వల్ల సంతానం కలగని మహిళలకు గరుత్మంతుని ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకమన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ మాధవరావు, ఈవో కృష్ణవేణి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని