logo

641 మందికి ఉద్యోగోన్నతులు

ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల తుది జాబితా ఓ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుదారులు పెట్టుకున్న అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరించారు.

Updated : 02 Jun 2023 06:15 IST

‌స్పష్టత దిశగా ఉపాధ్యాయుల బదిలీలు!

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల తుది జాబితా ఓ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుదారులు పెట్టుకున్న అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరించారు. మొత్తం 6,066 బదిలీకి దరఖాస్తు చేయగా.. 368 మంది లోపాలు సవరించాలని కోరుతూ అభ్యంతరాలు తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించి సహేతుకమైన కారణాలున్న వాటిని పరిష్కరించి తుది జాబితాను కమిషనర్‌ కార్యాలయానికి పంపించారు. మరోవైపు పదోన్నతులకు అర్హులైన వారి జాబితా రూపొందించారు. వీరికి కాగిత(పేపర్‌) పూర్వకంగా కల్పించనున్నారు. బదిలీల వెబ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మిగిలిపోయిన ఖాళీలను వారికి కేటాయిస్తారు. ఉమ్మడి ప్రకాశంలోని 56 మండలాల్లో కేటగిరీ వారీగా ఉన్న ఖాళీపోస్టుల వివరాలు సేకరించి ఆ నివేదికను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. అక్కడ ఆమోదం అనంతరం ఉపాధ్యాయులు చూసేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
వద్దన్న వారి నుంచి లేఖలు...: ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌., స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతులు పొందడానికి అర్హులైన వారి జాబితా సిద్ధమైంది. ఉద్యోగోన్నతులు తమకు అవసరం లేదని చెప్పిన వారి నుంచి లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకున్నారు. బదిలీలను మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం వెబ్‌ కౌన్సెలింగ్‌కే మొగ్గుచూపుతోంది. ప్రధానంగా ఎస్జీటీల బదిలీ దరఖాస్తులు వేలసంఖ్యలో ఉండటం వల్ల ఆప్షన్లు పెట్టుకోవడం కష్టమవుతుందని, పాత పద్ధతిలోనే నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఇంతవరకు స్పందన లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని