5 నుంచి జియామిన్ స్టోన్ ఫెయిర్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జియామిన్ స్టోన్ ఫెయిర్ ఈ నెల అయిదు నుంచి ఎనిమిదో తేదీ వరకు చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో జరగనుంది.
చైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్న గ్రానైట్ యజమానులు
చీమకుర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జియామిన్ స్టోన్ ఫెయిర్ ఈ నెల అయిదు నుంచి ఎనిమిదో తేదీ వరకు చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో జరగనుంది. ఇటలీలో నిర్వహించే వెరోనా స్టోన్ ప్రదర్శన తర్వాత జియామిన్ ఫెయిర్‌కే అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఎక్కువ. గతంలో ఇక్కడ జరిగిన ప్రదర్శనకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1.50 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారంటే దీని ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే గ్రానైట్ యజమానులు ఇక్కడ స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుంటారు. చీమకుర్తి ప్రాంతంలో వెలికి తీసే గెలాక్సీ గ్రానైట్ ముడి రాళ్లలో దాదాపు 70 శాతం చైనాకే ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ ప్రాంతంలోని స్టీల్ గ్రే, గురిజేపల్లిలోని బ్లాక్ పెరల్ రాళ్లు కూడా అక్కడికే వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో స్థానిక క్వారీ, గ్రానైట్ పరిశ్రమల యజమానులు... జియామిన్ ప్రదర్శనకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ ఒప్పందాలు కుదిరితే మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. గతంలో స్టాళ్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఎగుమతులు మందగించి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయడం లేదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు