ఉపాధినిచ్చే యంత్రమే ఉసురు తీసింది...
తాను చేసే పనులకు ఆ పరికరమే కీలకం. నిత్యం ఆ యంత్రంతోనే ఉపాధి పొందుతున్నారు. చివరికి అదే అతని పాలిట యమపాశమై ఉసురు తీసింది.
కిరణ్ (పాత చిత్రం)
పామూరు, న్యూస్‌టుడే: తాను చేసే పనులకు ఆ పరికరమే కీలకం. నిత్యం ఆ యంత్రంతోనే ఉపాధి పొందుతున్నారు. చివరికి అదే అతని పాలిట యమపాశమై ఉసురు తీసింది. ఈ విషాద సంఘటన మండలంలోని తూర్పుకట్టకిందపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుకట్టకిందపల్లికి చెందిన కోవూరు కిరణ్(36) భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కిరణ్ అదే గ్రామంలో నీరుకట్టు సత్యం అనే వ్యక్తికి చెందిన నూతన ఇంటి నిర్మాణ పనులు చేస్తుస్తున్నారు. దర్వాజా అమర్చేందుకు అప్పటికే కట్టిన ఇంటి గోడను విద్యుత్తు యంత్రం సాయంతో కోస్తున్నారు. ఈ సమయంలో యంత్రం అదుపు తప్పి అతని కాలిపై పడింది. మిషన్‌కు అమర్చిన బ్లేడ్‌లు వేగంగా మోకాలిలోకి దిగి లోతైన గాయం చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. విషయాన్ని గుర్తించిన స్థానికుకులు చికిత్స నిమిత్తం అతన్ని హుటాహుటిన సమీపంలోని పామూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో మృతిచెందారు. కిరణ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతనికి భార్య సౌజన్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కిరణ్ తండ్రి కోవూరు కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.సురేష్ తెలిపారు.
మృతికి కారణమైన యంత్రం ఇదే..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Peddha Kapu Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం
-
Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట
-
Arvind Kejriwal: కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్ స్పష్టత
-
Pawan Kalyan: మహేశ్-పవన్‌లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కన్నడ హీరో