logo

పట్టపగలే రూ.8 లక్షల సొత్తు చోరీ

మూలగుంటపాడులో పట్టపగలే రూ. 8 లక్షల సొత్తు చోరీ జరగడం కలకలం రేపింది. స్థానిక విద్యానగర్‌ మూడో వీధిలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది.

Published : 02 Jun 2023 05:45 IST

మూలగుంటపాడులో కలకలం

పరిశీలిస్తున్న సీఐ రంగనాథ్‌, సిబ్బంది

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మూలగుంటపాడులో పట్టపగలే రూ. 8 లక్షల సొత్తు చోరీ జరగడం కలకలం రేపింది. స్థానిక విద్యానగర్‌ మూడో వీధిలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. స్థానికంగా నివాసముంటున్న విశ్రాంత పంచాయతీ కార్యదర్శి చెవుల రాజచంద్రశేఖర్‌, భార్య లక్ష్మితో కలిసి గురువారం ఉదయం నెల్లూరు వెళ్లారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా, వెనుక తలుపులు ధ్వంసం చేసి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాను పగులగొట్టి 8 సవర్ల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి, రూ.15 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ సొత్తు విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందన్నారు. సీఐ రంగనాథ్‌, ఎస్సై ఫిరోజ ఫాతిమా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మరో గృహం తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఒంగోలు నుంచి వచ్చిన బృందం నిందితుల వేలిముద్రలను సేకరించింది. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రంగనాథ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని