logo

బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

జిల్లాను బాల కార్మిక రహితంగా తీర్చిదిద్దేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం కృషి చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 02:21 IST

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాను బాల కార్మిక రహితంగా తీర్చిదిద్దేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం కృషి చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మికశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అవగాహన ర్యాలీని... ప్రకాశం భవన్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్లల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి యజమానులకు ఆరు నెలల నుంచి ఏడాది జైలు... రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక కమిషనర్‌ శ్రీనివాస్‌కుమార్‌, సహాయ కార్మిక కమిషనర్లు అనితావాణి, ఎం.కోటేశ్వరరావు, పవన్‌కుమార్‌, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దినేష్‌కుమార్‌, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి ధనలక్ష్మి, దిశ సీఐ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. ‌్ర తనిఖీల్లో భాగంగా ఒంగోలు నగరంలో ముగ్గురు బాల కార్మికులను అధికారులు గుర్తించారు. వారిని బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. సదరు యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని