విద్వేషంపై ఆందోళన
అధికార పార్టీ వైకాపా ఏర్పాటు చేసిన విద్వేష ఫ్లెక్సీలను తొలగించాలంటూ జనసేన నాయకులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో ఆందోళన చేశారు.
నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు
నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: అధికార పార్టీ వైకాపా ఏర్పాటు చేసిన విద్వేష ఫ్లెక్సీలను తొలగించాలంటూ జనసేన నాయకులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో ఆందోళన చేశారు. ‘పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం’ పేరుతో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుతో పాటు ఆ పార్టీ నాయకుల చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలను నాగులుప్పలపాడు బస్టాండ్ కూడలిలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పెంట్యాల కోటి, ధనుష్, దానమూర్తి, చదలవాడ ఎంపీటీసీ సభ్యుడు శివకృష్ణతో పాటు పలువురు అదేరోజు రాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఆందోళనతో అధికార యంత్రాంగం స్పందించింది. చివరికి బస్టాండ్ కూడలితో పాటు మరికొన్నిచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం సద్దుమనిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు