logo

చంద్రన్నతోనే యువత భవితకు భరోసా

ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు భరోసా పేరుతో విడుదల చేసిన తెదేపా మొదటి విడత మేనిఫెస్టోపై తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2023 02:21 IST

కొండపిలో ప్రదర్శన నిర్వహిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు భరోసా పేరుతో విడుదల చేసిన తెదేపా మొదటి విడత మేనిఫెస్టోపై తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొండపి నియోజకవర్గంలో ప్రదర్శనలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ఇచ్చిన హామీలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యువత కళ్లు తెరిచి వైకాపా చీకటి పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

సింగరాయకొండలో జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తున్న తెలుగు యువత

న్యూస్‌టుడే, కొండపి, సింగరాయకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని