...అయిననూ వెళ్లి రావలె
ప్రజా ధనం దుబారా అంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. దిల్లీకి చెందిన ట్రావెల్స్ సంస్థతో ఒప్పందం చేసుకుని అతనికి ముందుగానే రూ.34 లక్షలు చెల్లించారు. అంత మొత్తం ఇవ్వడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లతో పాటు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా తప్పుబట్టారు.
అధ్యయన యాత్రకు కార్పొరేటర్లు
యాత్ర ప్రారంభానికి ముందు గుమ్మడి కాయ కొడుతున్న మేయర్ సుజాత.. చిత్రంలో కార్పొరేటర్లు
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రజా ధనం దుబారా అంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. దిల్లీకి చెందిన ట్రావెల్స్ సంస్థతో ఒప్పందం చేసుకుని అతనికి ముందుగానే రూ.34 లక్షలు చెల్లించారు. అంత మొత్తం ఇవ్వడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లతో పాటు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా తప్పుబట్టారు. ఆపై ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ట్రావెల్స్ సంస్థ నిర్వాహకుడు హఠాన్మరణం చెందారు. దీంతో ముందుగానే చెల్లించిన నగదును తిరిగి రాబట్టుకోవడం సమస్యగా మారింది. ఇన్ని అభ్యంతరాల మధ్య కూడా అధికారపక్ష కార్పొరేటర్ల కోరిక మేరకు మళ్లీ మున్సిపల్ నిధులు కేటాయించారు. తాజాగా శనివారం రాత్రి అధ్యయన యాత్రకు బయలుదేరి వెళ్లారు. కోఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం 55 మంది ఇందులో ఉన్నారు. తెదేపా, జనసేన సభ్యులు తాము వచ్చేది లేదని తేల్చి చెప్పారు. అధికార పార్టీ సభ్యుల్లో కూడా దాదాపు 20 మంది వరకు దూరంగా ఉన్నారు. మరో 26 మంది మాత్రం తమ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. వీరంతా పదకొండు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్ వరకు బస్సులో వెళ్లి.. అక్కడ నుంచి విమానంలో దిల్లీకి చేరుకుంటారు. నైనిటాల్, ముస్సోరి, హరిద్వార్, రిషికేష్, అమృత్‌సర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తిరిగి ఈ నెల 14న నగరానికి చేరుకుంటారు. వీరితో పాటు ఒక అధికారి వెళ్లారు. మేయర్ గంగాడ సుజాత నాలుగు రోజుల తర్వాత యాత్రలో భాగస్వాములవుతారని సమాచారం.
తరలివెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సు ఇదే..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు