logo

మహిళా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావ

మహిళా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావంగా స్త్రీ విముక్తి సంఘటన, జన సాహితి ఆధ్వర్యంలో... ఒంగోలు ఈమనిపాలెంలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ మీదగా నెల్లూరు బస్టాండ్‌ వరకు శనివారం ప్రదర్శన నిర్వహించారు.

Published : 04 Jun 2023 05:58 IST

ప్రదర్శనలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావంగా స్త్రీ విముక్తి సంఘటన, జన సాహితి ఆధ్వర్యంలో... ఒంగోలు ఈమనిపాలెంలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ మీదగా నెల్లూరు బస్టాండ్‌ వరకు శనివారం ప్రదర్శన నిర్వహించారు. జన సాహితి జిల్లా అధ్యక్షుడు జీవీ.కృష్ణయ్య మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ పెంచిన మహిళా రెజ్లర్లు గత అయిదు నెలలగా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా... కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. లైంగిక వేధింపులకు సంబంధించి భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ... రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలితకుమారి, రచయితలు నూకతోటి రవికుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి విజయసారథి, ఖాదర్‌బాషా, సుజాత, శైలజ, స్రవంతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని