సేద్యం ఖర్చులు తగ్గించేలా ప్రణాళిక
సాగులో అవరోధాలను అధిగమించి ఖర్చులు తగ్గించుకునేలా ఆర్బీకేల నుంచి మండల స్థాయి వరకు ఏడీఏలు, ఏవోలు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, చిత్రంలో ఆత్మ పీడీ అన్నపూర్ణ, ఇతర అధికారులు
ఒంగోలు గ్రామీణం, నగరం : సాగులో అవరోధాలను అధిగమించి ఖర్చులు తగ్గించుకునేలా ఆర్బీకేల నుంచి మండల స్థాయి వరకు ఏడీఏలు, ఏవోలు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2023-24 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై ఆత్మ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పచ్చిరొట్ట పైర్ల ప్రాధాన్యాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసే ప్రధాన పంటలపై ఆత్మ పీడీ కె.అన్నపూర్ణ అవగాహన కల్పించారు. బాపట్ల ఏఆర్‌ఎస్ ముఖ్య శాస్త్రవేత్త బి.కృష్ణవేణి, కేవీకే శాస్త్రవేత్త రాజమణి, దుర్గాప్రసాద్, కీటక శాస్త్రవేత్త రాజేష్ చౌదరి, జాహ్నవి, ఉద్యానశాఖ ప్రధాన శాస్త్రవేత్త ఎం.ముత్యాలనాయుడు... జిల్లాకు అనువైన వరి, అపరాల వంగడాలు; చీడపీడల యాజమాన్య పద్ధతులు తెలియజేశారు. అధిక విస్తీర్ణంలో సాగవుతున్న మిరపలో దిగుబడి, నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి
-
USA: అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్‌బీఐ..!
-
TDP: ‘ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’: వీడియో షేర్ చేసిన తెదేపా
-
Vizag: రుషికొండపై చకచకా పనులు.. కేసులున్నా వెనక్కి తగ్గకుండా..
-
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం.. క్రికెట్ సహా 5 పతకాలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు