logo

బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట, గాంధీరోడ్డు, కూరగాయల మార్కెట్‌ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Published : 04 Jun 2023 04:29 IST

దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఉప కమిషనర్‌  శ్రీనివాసకుమార్‌, ఇతర అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట, గాంధీరోడ్డు, కూరగాయల మార్కెట్‌ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ దుకాణాల్లో పనిచేస్తున్న ఇద్దరు బాల కార్మికులను గుర్తించి బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. పిల్లలతో పనిచేయిస్తే సంబంధిత దుకాణ యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసకుమార్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్‌ బి.అనితావాణి, సహాయ కార్మిక అధికారి ఎం.ఎలిజబెత్‌, డీసీపీవో దినేష్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని