logo

భూమాతకు ఆలయం

మండలంలోని విఠలాపురంలో భూమాతకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు. మాజీ సర్పంచి కైపు అంజిరెడ్డి, తన కుమారుడు కోటిరెడ్డి ఆధ్వర్యంలో రూ.3 లక్షలు సొంత నగదుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

Published : 04 Jun 2023 05:57 IST

మండలంలోని విఠలాపురంలో భూమాతకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు. మాజీ సర్పంచి కైపు అంజిరెడ్డి, తన కుమారుడు కోటిరెడ్డి ఆధ్వర్యంలో రూ.3 లక్షలు సొంత నగదుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో  భూగర్భం లోపల అమ్మవారి కోసం నిర్మించిన ఆలయం మరుగున పడడంతో మళ్లీ ఆ ఆలయం పక్కనే దీనిని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్లోబు ఆకారంలో ఈ ఆలయం ఆకట్టుకుంటోంది. గ్రామంతోపాటు జిల్లాకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు దాతలు తెలిపారు. దీనిని ఆదివారం ప్రారంభించి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు.

 - న్యూస్‌టుడే,తాళ్లూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని