logo

ఉపకారంలో మెరుపులు

జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభతో ప్రకాశించారు. అత్యధికంగా 203 మంది విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

Updated : 04 Jun 2023 05:27 IST

 203 మంది విద్యార్థుల విజయం 
ఏటా రూ.12 వేలు చొప్పున లబ్ధి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభతో ప్రకాశించారు. అత్యధికంగా 203 మంది విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 3,400 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 203 మంది ఉపకార వేతనం పొందడానికి అర్హత సాధించడం విశేషం. వీరి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. త్వరలోనే మెరిట్‌ కార్డులను రాష్ట్ర కార్యాలయం నుంచి పంపనున్నారు. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు కూడా అందజేస్తారు. అక్కడి నుంచి విద్యార్థికి పంపిణీ చేస్తారు.

రెండేళ్లుగా నిలిచిన ఎన్‌టీఎస్‌...: నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌(ఎన్‌టీఎస్‌) పరీక్ష గత రెండేళ్లుగా నిలిచిపోయింది. ఎన్‌ఎంఎంఎస్‌ ఒక్కటే నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 9, 10, 11, 12 తరగతుల వరకు ఏటా రూ.12,000 చొప్పున ఉపకార వేతనాన్ని నేరుగా విద్యార్థి ఖాతాకు జమ చేస్తారు. తదుపరి నాలుగేళ్లు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివితే  స్కాలర్‌షిప్‌ లభించేది. ఉమ్మడి ప్రకాశంలో ఏటా 300 మందికి పైగా లబ్ధి పొందుతుండగా, ఈసారి విభజన ప్రకాశంలోనే 203 మంది ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థి పేరుతో ఖాతా తెరవాలి...

ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. విద్యార్థి పేరుతో సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా తెరవాలి. తల్లిదండ్రుల్లో ఒకరు జాయింట్‌ చేసుకోవచ్చు. విద్యార్థి ఆధార్‌ నంబర్‌నే ఆ ఖాతాకు అనుసంధానం చేయాలి. సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లకు సంబంధించిన ఖాతాలు పనికిరావు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్‌ కార్డులో ఉన్న విధంగానే ఆధార్‌, బ్యాంకు పాస్‌పుస్తకంలో ఉండాలి. ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా సరిచూసుకోవాలి.

శివకుమార్‌,విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని