ఆ హెడ్‌కు ఇంకోటి
అతనో పోలీసు హెడ్ కానిస్టేబుల్. గతంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయినా పంథా మార్చుకోలేదు.
నర్సుతో అసభ్య ప్రవర్తన
ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అతనో పోలీసు హెడ్ కానిస్టేబుల్. గతంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయినా పంథా మార్చుకోలేదు. మరోసారి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఏడూరి కోటిరెడ్డి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో బాధితుడి వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆదివారం రాత్రి సుమారు 11.30 సమయంలో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అతను లిఫ్టు ఎక్కగా.. అప్పటికే అందులో ఒక నర్సు ఉన్నారు. లిఫ్టు తలుపులు మూసుకోగానే ఆమె చేయి పట్టుకుని అనుచితంగా ప్రవర్తించారు. హత్తుకుని ముద్దు పెట్టుకునే యత్నం చేశారు. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేశారు. లిఫ్టు తలుపులు తెరుచుకోగానే అతని చెర నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. హెడ్ కానిస్టేబుల్ అఘాయిత్యంపై వైద్యశాల ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఉదంతంపై వైద్యశాల యాజమాన్యం సోమవారం ఉదయం ఎస్పీ మలికా గార్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు బాధిత నర్సు నుంచి ఫిర్యాదు తీసుకుని హెడ్ కానిస్టేబుల్ కోటిరెడ్డిపై ఒంగోలు తాలూకా పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ కోటిరెడ్డి గతంలో మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో బందోబస్తు విధుల నిమిత్తం వెళ్లి దాహార్తి తీర్చుకునే నెపంతో ఒక మహిళ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు ఆయనపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ కేసు నుంచి తనను బయట పడేసేందుకు ఆయన ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులను ఆశ్రయించినట్టు తెలిసింది. ఈ తరహా వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని వారు తిరస్కరించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్