logo

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు

డయాలసిస్‌ రోగుల విషయంలో కేంద్రం నిర్వాహకులు, సీహెచ్ సీ  వైద్యులు మాకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యం వహించడం సరికాదని జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్‌) డా. ఎస్‌.ఎన్‌.మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 06 Jun 2023 05:34 IST

డయాలసిస్‌ సరిగ్గా చేయడం లేదని డీసీహెచ్‌ఎస్‌ డా.ఎస్‌.ఎన్‌.మూర్తికి ఫిర్యాదు చేస్తున్న బాధితుడు

కనిగిరి, న్యూస్‌టుడే: డయాలసిస్‌ రోగుల విషయంలో కేంద్రం నిర్వాహకులు, సీహెచ్ సీ  వైద్యులు మాకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యం వహించడం సరికాదని జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్‌) డా. ఎస్‌.ఎన్‌.మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి డయాలసిస్‌ సెంటర్‌లో రోగులకు సేవలు సక్రమంగా అందడం లేదని, మందులు లేక, సౌకర్యాలు కల్పించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలను తెలుపుతూ ‘రోగుల ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ఈ నెల 4న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డయాలసిస్‌ సెంటర్‌ను మూర్తి సోమవారం తనిఖీ చేశారు. రోగులు వేచి ఉండే చోట గాలిపంకాలు లేకపోవడం, కూర్చునేందుకు కుర్చీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి వైద్యాధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలు దస్త్రాలను పరిశీలించి సక్రమంగా నిర్వహించడం లేదని సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డయాలసిస్‌ సేవలు సక్రమంగా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రోగులు ఆయన ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం జనరేటర్‌ను పరిశీలించారు. విద్యుత్తు శాఖ కనెక్షన్‌ ఇచ్చినా.. జనరేటర్‌ వినియోగించడంపై ప్రశ్నించారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డా. అబ్దుల్‌ కలాం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని