logo

కార్డున్నా ఉపాధి పనులకు రానివ్వడం లేదు

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Published : 06 Jun 2023 03:23 IST

అర్జీలు ఇచ్చేందుకు వరుసలో నిల్చున్న ప్రజలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసులు, శిక్షణ కలెక్టర్‌ శౌర్య పటేల్‌, డీఆర్వో ఆర్‌.శ్రీలత, ఎస్‌డీసీలు లోకేశ్వరరావు, చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

* సాదా బైనామా కోసం అర్జీ చేసి రెండు నెలలు పూర్తయినా... ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేని మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

* తమకు కార్డు ఉన్నా ఉపాధి పనులకు రానివ్వడం లేదని కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఎం.సుబ్బారెడ్డి అధికారుల వద్ద వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని